‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఉన్న క్రేజ్ మాములుగా ఉండ‌దు. 90వ ద‌శ‌కంలో ఓ రేంజ్‌లో సినీ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిని చిరు.. నేటికి అదే ట్రేండ్ తో ముందుకు సాగుతూ.. త‌న హ‌వా కొన‌సాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోల‌కు తాను ఏ మాత్రం త‌క్కువ కాదంటూ క్లాసు.. మాసు.. యాక్ష‌న్.. డాన్సులో దుమ్మురేపుతూ పోటీనిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ “వీర‌య్య”‌గా త‌న విశ్వ‌రూపాన్ని చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాడు చిరు. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా సిద్ధం చేయ‌ల‌నుకుంటున్నాడు. దీనికి కార‌ణం ఆయ‌న ఇప్ప‌టికే మూడు ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం. అందులో మ‌లయాళ రీమేక్ లూసిఫ‌ర్ ఒక‌టి. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. అలాగే, త‌మిళ మూవీ వేద‌ళంను తెలుగులోకి రీమేక్ చేయ‌బోతున్నారు చిరు.

- Advertisement -

దీనితో పాటు డైరెక్ట‌ర్ బావీ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ రెండు సినిమాల కంటే ముందు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో చిరు చాలా ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించ‌బోతున్నార‌ని టాక్. హీరో పాత్ర‌ను బ‌ట్టి ఈ చిత్రానికి వీర‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం జోరుగా జ‌రుగుతున్నాయి.

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

రంగుల కేళీ.. సంబురాల హోలీ !

అభినవ ఉసేన్ బోల్ట్‌.. కంబ‌ళ వీరుడి స‌రికొత్త రికార్డు !

మ‌ణిశ‌ర్మ బీటూ.. చిరు స్టెప్పూ !

మళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రముండదు: ఏపీ హోం మంత్రి

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -