కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఎఫెక్ట్ కీలకనేతలంతా రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని ఆశీంచారు విష్ణు. అయితే ఈ టికెట్‌ను అజారుద్దీన్‌కు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అస్సలు ఊహించలేదన్నారు. పార్టీలో ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్ ఇచ్చారు…కానీ తన వరకు వచ్చేసరికి టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రేటర్లో పార్టీ గెలిచే ఏకైక సీటు జూబ్లీహిల్స్‌ను కొల్పోయిందన్నారు.అనుచరులతో భేటీ తర్వాత విష్ణు కారెక్కనున్నట్లు సమాచారం.
ఇదే బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లేదా నారాయణపేటల్లో సీటు ఆశించిన ఎర్రశేఖర్,వనపర్తిలో మేఘారెడ్డి,దేవరకద్ర టికెట్ ఆశించిన ప్రదీప్‌కుమార్ గౌడ్ సైతం పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు టికెట్ కోమటిరెడ్డికి కేటాయించడంతో చలమల కృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ తన అనుచరులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ,మహేశ్వరం పారిజాత నర్సింహారెడ్డి,ఎల్బీనగర్లో మల్రెడ్డి రాంరెడ్డి ,శేరిలింగంపల్లి టికెట్ ఆశించి రఘనాథ్ యాదవ్ భంగపడ్డారు. ఇలా మొత్తంగా కాంగ్రెస్ సెకండ్ లీస్ట్ ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
