Monday, May 13, 2024
- Advertisement -

అర్ధశాస్త్రం.. నదీ ప్రవాహాం లాంటిది

- Advertisement -

ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాలుగు రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా ‘భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు’ పేరిట నాలుగు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. దేశ ఆర్థిక రంగం స్థితిగతులు, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఆర్థికాభివృద్ధి, అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై కూలంకషంగా చర్చించనున్నారు. సదస్సుకు వచ్చిన ఆర్థిక వేత్తలు ఏడు ప్యానళ్లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చిస్తారు.

శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, ప‌లువురు ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. కాగా, బ్రిటిష్ ఇండియాలో 1917లో ప్రారంభమైన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్‌కు నేటికి 100 సంవత్సరాలు. గత 99 ఐఈఏ వార్షిక సమావేశాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగగా.. ఈ 100వ సమావేశాలు నవ్యాంధ్ర రాజధానిలో జరుగుతుండటం విశేషం.ప్రపంచంలో ఆర్థికాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించే.. ఐఏఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ లో జరగడంతో ఏఎన్ యూ సభాప్రాంగణంతో అతిథులతో నిండిపోయింది. సదస్సు ప్రారంభం అనంతరం జరిగిన సభలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. అర్థశాస్త్రం నదీ ప్రవాహం లాంటిదని, ఎన్నో శాస్త్రాలను తనలో ఇముడ్చుకుందని అన్నారు. రాష్ట్ర విభజనతో తర్వాత ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురయ్యాయని.. అయినా ధైర్యంగా ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్‌ రెండంకెల వృద్ధి నమోదు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐఈఏ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి హాజరుకావడం సంతోషంగా ఉందన్న సీఎం… 2029 నాటికి ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిపుతామన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మెరుగైన వృద్ధిరేటు నమోదు చేస్తోందని ప్రశంశించిన గవర్నర్.. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండటం ఏపీకి అదనపు బలమని అన్నారు.

యువత కీలకపాత్ర పోషిస్తే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన తెలిపారు. 1917లో ప్రారంభమైన ఐఈఏకు వందవ వార్షిక సమావేశాలకు నాగార్జున విశ్వవిద్యాలయం వేదిక కావటంతో సదస్సుకు హాజరైన అతిథులు, ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు.. బుధవారం ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చేరుకున్నారు. ఐఈఏ సదస్సు అనంతరం సచివాలయంలో ఫైబర్‌గిడ్‌ను ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -