Monday, May 6, 2024
- Advertisement -

ఎట్ట‌కేల‌కు టీటీడీ చైర్మ‌న్‌గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వులు పంచేశారు. అధికార పార్టీ తెలుగుదేశం సీనియ‌ర్ నాయ‌కులకు ప‌ద‌వుల‌ను పంచిపెట్టేసింది. భారీ స్థాయిలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేపట్టింది. ఒకేసారి 17 సంస్థలకు చైర్మన్‌లను నియమిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగళవారం అర్ధ‌రాత్రి ఈ జాబితా విడుదల చేసింది.

రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద‌విగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్ష పదవికి ఊహించిన‌ట్టే వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను నియ‌మితుల‌య్యారు. ఆయన గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. ప‌లు సంస్థ‌ల‌కు చైర్మ‌న్‌లుగా నిర్ణ‌యిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆర్టీసీ చైర్మన్‌: వర్ల రామయ్య
ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌: దళిత నాయ‌కుడు జూపూడి ప్రభాకరరావును కొనసాగించారు.
సాగునీటి అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు: కిశోర్‌ కుమార్‌ రెడ్డి(మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు)
కాపు కార్పొరేషన్ చైర్మ‌న్‌: మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు: మన రాంబాబు (తూర్పు గోదావరి జిల్లా నాయ‌కుడు)

అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు: దివి శివరాం (ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే)
మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌: జియావుద్దీన్ (లాల్‌జాన్‌బాషా సోదరుడు )
మైనారిటీ ఆర్థిక సంస్థ కార్పొరేషన్‌ చైౖర్మన్‌: హిదాయత్‌కు (మరోసారి అవకాశం)

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు: రాజా మాస్టార్ (టీడీపీ శిక్షణ శిబిరాల నిర్వహణ- గుంటూరు జిల్లా నాయ‌కుడు)
ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌లుగా: సుభాశ్‌ చంద్రబోస్ (చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ నాయ‌కుడు), చల్లా రామకృష్ణారెడ్డి (కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -