Sunday, May 12, 2024
- Advertisement -

ఏపీ లో టీడీపీ – వైకాపా ఎమ్మెల్యే లో కాంగ్రెస్ లోకి ??? నవ్వొస్తోంది కదూ ?

- Advertisement -
Raghuveera Reddy Target in 2017

ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందొ అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విభజన తరవాత ఇక్కడి ప్రజలు వారికి కనీసం డిపాజిట్ లు కూడా ఇవ్వలేదు. అయితే శవానికీ – శరీరానికీ మధ్యలో నలుగుతున్న ఏపీ కాంగ్రెస్ కి పీసీసీ ప్రధాన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రఘువీరా రెడ్డి ప్రాణం పోయ్యలని చూస్తున్నారు. దానికోసం ఆయన పెట్టుకున్న టార్గెట్ చూస్తే మతి పోతుంది అనే చెప్పాలి. ఆయన టార్గెట్ వింటే మైండ్ బ్లాక్ అయ్యి తీరాల్సిందే. ఆయన టార్గెట్ ఏంటంటే టీడీపీ – వైకాపా ల ఎమ్మెల్యే లాని కాంగ్రెస్ లోకి తీసుకుని వస్తారట.

పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఈ కొత్త టార్గెట్ పెట్టుకోవడానికి కారణం ఉంది. తమ పార్టీకే చెందిన ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సాధించిన విజయాలు చూసి ఆయన ఇన్స్పైర్ అయి ఈ టార్గెట్ ఫిక్సు చేసుకున్నారట.  ముఖ్యంగా రాజస్థాన్ లో దాదాపుగా ఏపీలో ఉన్నట్లే ‘చితి’కిపోయిన కాంగ్రెస్ కు యువ నేత సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడిగా  ఉన్నారు.  ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను మళ్లీ పార్టీలోకి తెచ్చారు. అంతేకాదు.. ఏం వ్యూహం రచించాడో ఏమో కానీ అత్యంత బలంగా ఉన్న అక్కడి బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఏమీ లేని కాంగ్రెస్ లోకి లాగేశారు.  అంపశయ్యపై ఉన్న తమ పార్టీలోకి కూడా వలసలు ఉన్నాయని సచిన్ పైలట్ నిరూపించారు.    

సచిన్ ను  ఆదర్శంగా తీసుకొని పంజాబ్ లో కూడా ఇదే ప్రయోగం చేశారు కెప్టెన్ అమరేందర్ సింగ్. ఇటీవలే ఇద్దరు అకాలీదళ్ ఎమ్మెల్యేలు – బిజెపికి రాజీనామా చేసిన మరో మహిళా ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి లాగారు. దీంతో అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి హీరో అయ్యారు. వీటిని చూసిన పి.సి.సి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పూర్తిపొందారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని భావించే తరుణంలో ఇక్కడ ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో రఘువీరా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఇంతవరకు వర్కవుట్ కాలేదు. కొత్త సంవత్సరంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -