Monday, May 13, 2024
- Advertisement -

రామోజీ vs ఉండవల్లి , ‘పద్మ’ గురించి

- Advertisement -

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇండస్ట్రీ దిగ్గజం , సంపాదకీయుడు రామోజీ రావు మీద తీవ్ర విమర్శలు ఒచ్చాయి. మార్గదర్శి విషయంలో రాజశేకర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ని అడ్డం పెట్టుకుని కథ నడిపించారు.

సాధారణంగా ఏదైనా ఆర్ధిక సంస్థ దివాళా తీసింది అని పుకారు ఒస్తేచాలు పెద్ద దుమారం రేగుతుంది , కానీ అప్పట్లో స్వయంగా ప్రభుత్వం రామోజీరావు కి చుక్కలు చూపించినా జనం రామోజీ తో పాటే ఉన్నట్టు కనిపించారు.  రామోజీ పట్ల కించిత్ సందేహాన్ని వ్యక్తం చేయకుండా ప్రజలు వ్యవహరించిన తీరుపై అప్పట్లో విస్మయం వ్యక్తం కావటమే కాదు.. రామోజీకి ప్రజల్లో ఇంత నమ్మకం ఉందా? అని ఆశ్చర్యపోయిన పరిస్థితి. 

నెమ్మదిగా సమయం తీసుకుని ఎవరి డబ్బు వారికి లిక్విడ్ క్యాష్ రూపంలో ఇచ్చేసారు రామోజీ కూడా. అయితే అప్పుడు రామోజీ తో మూడు చెరువుల నీళ్ళు తాగించిన ఉండవల్లి మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షం అయ్యారు. రామోజీ రావుకి తాజాగా పద్మ విభూషణ్ ఒచ్చిన సంగతి తెలిసిందే దాని మీద హై కోర్టు లో పిల్ దాఖలు చేసారు ఉండవల్లి. రామోజీకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించటాన్ని ప్రశ్నిస్తూ.. ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేయటం ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -