సీఎం జగన్‌పై ఉండవల్లి ఫైర్..

- Advertisement -

ఏపీ సీఎం జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సభను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. పతిపక్ష నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసి వారు సభను భహిష్కరించేలా చేయడం సిగ్గమాలిన చర్య అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో 26 బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం.. బిల్లుల్లో ఎలాంటి లోపాలున్నాయో ప్రతిపక్షం ఉంటే లేవత్తేదన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసిన ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతవరకు పర్యటించక పోవడ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయలో పాదయాత్రల మీద పాదయాత్రలు చేసిన జగన్.. ఆపద సమయంలో వారి వద్దకు వెళ్లకుండా కల్లిబొల్లి కబుర్లు చెప్పుతున్నారని విమర్శించారు. అత్యవసర సహాయం కోసం కేంద్రం వద్ద చేయి చాచడం ఏంటన్న ఉండవల్లి.. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందా అని ప్రశ్నించారు.

- Advertisement -

మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకున్న జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మళ్లీ ప్రజల మద్దతుతో బిల్లు ప్రవేశపెడుతామని సీఎం అన్నారని, ముందుగా అమరావతి రైతుల అభిప్రాయాన్ని, వారి మద్దతును ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు.

కేసీఆర్ పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి

ఉప్పు నిప్పు కలిసిన వేళ!

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -