Saturday, May 4, 2024
- Advertisement -

మొద‌ల‌యిన సంక్రాంతి సంద‌డి… పందెం కోడి @ రూ.50,000

- Advertisement -

సంక్రాంతి రాక‌ముందే కోడి పందేల‌కు రెడీ అవుతున్నారు. ఒక ప‌క్క కోడి పందేల‌ను హైకోర్టు నిషేధించినా ఆగ‌డంలేదు. పందేల్లో దిగ‌డానికి పందెం రాయుల్లు కొత్త ప‌ద్ద‌తుల‌ను వెతుక్కుంటూ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ప్ర‌తీ ఒక్క‌రి ద‌గ్గ‌ర స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉండ‌టంతో హైటెక్ ప‌ద్ద‌తుల‌ను వెతుక్కుంటున్నారు.

సంక్రాంతి అంటే ముందుగా గుర్తుచ్చే పందెం కోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు వీటి నిర్వాహకులు ఆన్‌లైన్ బాట పట్టారు. తమ వద్ద ఉన్న కోళ్ల ఫోటోలు, ధరలను పెంపకందారులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారు. పందెంరాయుళ్లు ఒక్కో పుంజును రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు

ఆన్‌లైన్‌లో విక్ర‌యాలు భారీగా జ‌రుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చుట్టు పక్కల గ్రామాల్లో పందెం కోళ్లను ఎక్కువగా పెంచుతున్నారు. పుంజును బట్టి ధరను నిర్ణయించి వాటి ఫోటోలు, వివరాలను సామాజిక మాధ్యమాల్లో కస్టమర్లకు అందుబాటులో పెడుతున్నారు.

పోలీసుల కంటపడకుండా చుట్టూ కంచెను ఏర్పాటు చేసి బయటికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ విధానం రెండేళ్ల నుంచి అమలు చేస్తున్నామని… దీనికి స్పందన బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. ఆన్‌లైన్ విక్రయాలతో వ్యాపారం కూడా బాగా మెరుగుపడిందని పందెం కోళ్ల పెంపకందారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -