Saturday, April 20, 2024
- Advertisement -

కాంట్రాక్టర్‌పై చెత్త పోయించిన ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

- Advertisement -

ముంబైలో గత నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాల కారణంగా ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దీంతో ఎటుచూసినా వ్యర్థాలు, మురుగు నీరే దర్శనమిస్తోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబయిలోని చాందివాలీ ప్రాంతంలో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండడంతో అక్కడి శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను చెత్తలో కూర్చోబెట్టి కాలువ వ్యర్థాలను మీద వేయించారు. డ్రైనేజీ క్లీన్ చేయలేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే దిలీప్ లాండే దగ్గర ఉండి ఇలాంటి పనులు చేసిన వారికి ఇలాంటి శిక్షే విధించాలని అతడిపై చెత్తను వేయాలంటూ ఆదేశించారు.

తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రోడ్లపై మురికినీరు నిలవడానికి ఆ కాంట్రాక్టరే కారణమని, తన విధి నిర్వహణలో అతడు విఫలమయ్యాడని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆరోపించారు.

https://twitter.com/MeghUpdates/status/1403998482331963398?s=20

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -