ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలసాయి బాబా మంగళవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. బాలసాయి బాబా మరణించడంతో ఆయన అభిమానులు,భక్తులు శోక సంధ్రంలో మునిగిపోయారు.బాల సాయి బాబాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు.ఆయన మరణంపై రాజకీయ,సినీ రంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు.బాలసాయి బాబా బాడీ పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్లు షాకింగ్ విషయాలను తెలియజేశారు. బాలసాయి బాబా బాడీని పోస్ట్‌మార్టమ్ చేసిన డాకర్లు ,ఆయన మరణానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. ఆ ముఖ్య కారణలు ఏంటో ఓసారి మనం కూడా తెలుసుకుందాం.
18 ఏళ్ల వయస్సులోనే బాబా అవతారం ఎత్తిన ఆయన తన నోట్లో నుంచి శివలింగం తీయడం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు.బాలసాయి బాబా బాడీలో ఎక్కువుగా విభూది బయటిపడినట్లు డాక్టర్లు తెలిపారు.ఈ విభూది దాదాపు కేజీకి పైగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఇక ఆయన మరణానికి మరో కారణం కూడా ఉందట.ఆయన కడుపులో నుంచి శివలింగం కూడా బయటికి తీసేవారు.ఇది మ్యాజిక్ వంటిది.దీని కోసం ఆయన ఒక రోజు ముందు నుంచే తన కడుపులో శివలింగాన్ని దాచుకుని భక్తుల ముందు బయటికి తీసేవారని తెలుస్తుంది.వీటి వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కవై ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారని డాక్టర్లు తెలిపారు.దేని వల్ల అయితే బాలసాయి బాబా ప్రాచుర్యం పొందారో,దానివల్లే ఆయన ప్రాణం పోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
