కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న బైక్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి.
బస్సు డ్రైవర్, రెండో డ్రైవర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేశారు. బస్సు ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం సమయంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, బస్సులోని ప్రయాణికులు ఎక్కువ మంది మెయిన్ డోర్ నుంచి బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డోర్ లాక్ అయిపోయింది. వైర్ కాలి పోవడంతో డోర్ ఓపెన్ అవ్వలేదు ఇప్పటివరకు 19 మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 20మంది వరకు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08518-277305,కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101059,ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101061,కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నెంబర్లు:9494609814,9052951010 నెంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
