- Advertisement -

పాట పాడిన స్మ్రితి ఇరానీ

- Advertisement -

కేంద్ర జౌళీ శాఖా మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ ఇదివరకు లాగానే తన దూకుడు శైలి మార్చుకోలేదు. తన శాఖని మార్చడం పట్ల విలేఖరులు అడిగిన వరస ప్రశ్నలకి ఆమె చెప్పిన సమాధానం మైండ్ బ్లోయింగ్ గా ఉంది అంటే నమ్మండి. తనకి బాధ్యతలు దక్కడం మీద ఆమె రిప్లై ఒక సినిమా పాట రూపం లో సమాధానం చెప్పారు.

‘కుఛ్ తో లోగ్ కహేంగే లోగోంకా కామ్ హై కహనా’ (జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడడమే వాళ్ల పని) అనే పాపులర్ హిందీ సినిమా పాటను ఉదహరించారు. టీవీ నటిగా పాపులర్ అయిన స్మృతి ఇరానీ 2014 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయడం ద్వారా ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి రావడం తెలిసిందే.

ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ బిజెపి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అప్పగించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -