Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌క్క‌వాడికి చెప్పేందుకే నీతులు…. మ‌న‌కు వ‌ర్తించ‌వా…!

- Advertisement -
Somi Reddy fire on ysrcp

ఇత‌రుల‌కు   నీతులు చెప్పేందుకే ఉంటాయి… కానీ మ‌న దాకా వ‌స్తే మాత్రం  వాటిని తుంగ‌లోకి తొక్కేస్తారు. ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి అలానే ఉంది.  గుర‌వింద త‌న కిందున్న న‌లుపు ఎరుగ‌న‌ట్లు టీడీపీ మాట‌లు కూడా అలానే ఉన్నాయి. త‌ప్పుచేసిన వారిమీద సోషియ‌ల్ మీడియాలో  వార్త‌ల‌ను పోష్ట్  చేశార‌ని ర‌వికిర‌ణ్‌ను ఏకంగా అరెస్ట్ చేయించింది ప్ర‌భుత్వం.

లోకేష్‌ను కించ‌ప‌రిచినా ..  ప్రభుత్వ అధికారుల‌ను బెదిరిస్తే  ఎవ‌రినైనా     ఎవ‌రినైనా జైల్లో పెడ‌తామ‌ని ఆపార్టీ  వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఘాటుగా విమ‌ర్శించారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది మ‌రి అధికార పార్టీ  ఎంపీ,ఎమ్మెల్య‌లు మాత్రం ఐఏఎస్అధికారుల‌పై  చేసిన దాడులు గుర్తులేవా మంత్రిగారికి.

గతములో, వనజాక్షి అనే మహిళా రెవెన్యూ అధికారిణిపై దాడిచేసిన చింతమనేని ప్రభాకర్ అనే పక్కా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యునితో ప్రభుత్వం రాజీ పరచింది. కేసు లేకుండా చేశారు. ఈ  సెటిల్మెంటులో వనజాక్షి గారు ప్రభుత్వంతో తల నొప్పి ఎందుకని, సాధారణ ఉద్యొగినిగా తల వంచుకోవటమే కాదు, ఒక అధికారిణిగా ఆమెలోని నైతిక స్థైర్యం పూర్తిగా బిక్క చచ్చిపోయి ఉంటుంది. అప్పుడు క‌నిపించ‌లేదా టీడీకి. 

విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలోకి దౌర్జన్యంగా దూసుకు వెళ్లి మరీ అక్కడ కమిషనర్, సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యం పై టీడీపీ నేతలు దాడి చేసినా ఇప్పటి వరకు కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  ఏకంగా  చంద్రబాబు చేసిన రాజీ పంచాయితీ  చేశారు. .కెమెరాల సాక్షిగా కమిషనర్‌పై బోండా ఉమా, కేశినేని నాని, బుద్దా వెంకన్న దౌర్జన్యం చేసినా ఐపీఎస్‌ ల సంఘం కూడా గట్టిగా ప్రతిఘటించలేకపోయింది. నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలాగే రాజీ పంచాయతీ చేసి పంపించారు. 

మ‌రి ఇప్పుడు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడే మాటులు చూస్తే మేము చెప్పేందుకే నీత‌లు ఉంటాయిఆనీ వాటిని మేము పాటించం అన్న‌ట్లుగా ఉంది.  ఏమంటే మేము అధికారంలో ఉన్నాం. బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని విజయ సాయి రెడ్డిని హెచ్చరించారు. అధికారులను బెదిరిస్తే జైలుకు వెళ్లక తప్పదని సోమిరెడ్డి చెప్పారు. అధికారులను బెదిరించడం రాజ్యసభ సభ్యులకు హుందాతనం కాదని  నీతి మాట‌లు  పలికారు…. మ‌రి ఎమ్ ఆర్‌వో వ‌న‌జాక్షి మీద దాడిచేసిన చింత‌మ‌నేని…, ఐఏఎస్ అధికారి బాల‌సుబ్ర‌మ‌న్యంమీ దాడిచేసి ఎంపీ నాని, ఎమ్మెఎల్ఏ బొండాఉమ‌, ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న‌ల‌ను  ఏ జైల్లో పెట్టాలి. మ‌రి వీరంద‌ర్ని ఎందుకు జైలుకు పంప‌లేదు.

Also Read

  1. ఏర్పేడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌..
  2.  వైసీపీ …టీడీపీ మ‌ధ్య సోషియ‌ల్ వార్
  3. రవికిరణ్ ను అరెస్ట్ చేసారు సరే.. మరి వీళ్ల సంగతి ఏంటి బాబులు..?
  4. నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు….. నేను అండ‌గా ఉంటా..

{loadmodule mod_sp_social,Follow Us}

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -