బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత పదాహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందిన విషయాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. యావత్ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురయ్యింది. ఆమె మరణం వార్త నిజమా? అని తమకు తాము ప్రశ్నించుకుంటున్నారు. తెల్లారేసరికి ఈ విషాద వార్త వినడం కలచివేస్తోంది. ఆమె మరణించడాన్ని తోటి నటులు, సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు విషాదంలో మునిగారు. ఆమెకు అశ్రునివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా కన్నీరుమున్నీరయ్యారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావుతో ఎంతోమంది ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు.
నటులు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రవితేజ, అల్లు అర్జున్, సుధీర్‌బాబు, రానా దగ్గుబాటి, నితిన్, తమిళ స్టార్ మోహన్‌లాల్, హీరోయిన్లు హేమమాలిని, రమ్యకృష్ణ, మీనా, పరిణతీచోప్రా, ఐశ్వర్యరాయ్, నయనతార, కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్, శృతిహాసన్, ప్రియమణి, కుష్బూ, ఎస్ఎస్ రాజమౌళి, అశ్వనీదత్ ఇలా ఎంతోమంది ఆమెను స్మరించుకుంటున్నారు. ఆమెకు అశ్రునివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మశాంతి కలగాలని.. దేవుడా నీకెందుకు ఇంత తొందర అని తిట్టేసుకుంటున్నారు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అయితే ఆమె మృతిని నమ్మడం లేదు. దేవుడిని నిందిస్తూ చీవాట్లు పెడుతున్నాడు. ఆమెతో తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నాడు.
