Friday, May 3, 2024
- Advertisement -

ఇది వింత జననం.. ఏకంగా 27 ఏళ్ల తర్వాత..!

- Advertisement -

ఆమె..27 ఏళ్ల తర్వాత పుట్టడమేంటీ? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఆశ్చర్యాన్ని వాస్తవం చేసింది ఆధునిక వైద్యశాస్త్రం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్​ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది.

టీనా గిబ్సన్​ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు. అప్పటి నుంచి క్రయోజనిక్​ ఫ్రీజర్​లో భద్రపరిచారు. అలా ఉంచిన పిండాన్ని ఈ ఏడాది ఆరంభంలో గిబ్సన్​ గర్భాశయంలోకి పంపారు. ఆమె అక్టోబర్​ 26న మాలీ ఎవ్రెట్​ గిబ్సన్​కు జన్మనిచ్చింది.

ఇలా శీతలీకంరించిన పిండం ద్వారా శిశువుకు జన్మనివ్వటం గిబ్సన్​కు కొత్త కాదు. ఆమె మొదటి కుమార్తె ఎమ్మా రెన్​ గిబ్సన్​ కూడా 24ఏళ్ల పాటు భద్రపరిచిన పిండం నుంచి జన్మించిందే. అప్పటికి అది రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును మాలీ ఎవ్రెట్​ గిబ్సన్​ అధిగమించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే..ఈ రెండు పిండాలు 1992లో ఒకే వ్యక్తి నుంచి సేకరించినవే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -