Friday, March 29, 2024
- Advertisement -

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

- Advertisement -

గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మద్య వార్ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. రెండు దేశాలకు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్ఠం, ఆస్తి నష్టం జరిగినప్పటికి ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. నాటో అండ చూసుకొని బరిలోకి దిగిన ఉక్రెయిన్ చివరకు ఒంటరిగానే పోరాడాల్సి వచ్చింది. అటు రష్యా ఉక్రెయిన్ పై వార్ ను ప్రస్టేజియస్ గా తీసుకోవడంతో ఈ రెండు దేశాల మద్య యుద్దం ప్రపంచం మొత్తం మీద సంచలనంగా మారిన సంగతి మానందరికి తెలిసిందే. అయితే ఈ యుద్దం బాహ్యంగా రష్యా, ఉక్రెయిన్ మద్య జరుగుతున్నప్పటికి, అంతర్లీనంగా అమెరికా, రష్యా మద్య జరుగుతున్నా యుద్దం గా భావించక తప్పదు..

ఎందుకంటే ప్రపంచ పెద్దన్న పాత్ర కోసం ఎప్పటి నుంచో అమెరికా, రష్యా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అద్యక్ష్యత వహిస్తున్న నాటో లో చేరేందుకు ఉక్రెయిన్ ఆసక్తి చూపిస్తుండడంతో రష్యా ఈ యుద్దని మరింత తీవ్ర తరం చేస్తోంది. అయితే ఉక్రెయిన్ కు మాత్రం నాటో సభ్యత్వ దేశాలు మాట సాయం తప్ప.. చేతల సాయం చేసింది లేదు. దీంతో ఉక్రెయిన్ ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ పై తాజాగా అమెరికా నోరు విప్పింది.

ఉక్రెయిన్ పై రష్యా వార్ చేపట్టబోతోందన్న విషయం తమకు ముందే తెలుసని, ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అద్యక్షుడు వ్లాదిమార్ జెలన్ స్కీ కి చెప్పినప్పటికి అతను వినడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తాజాగా అమెరికా అద్యక్ష్యుడు జో బైడెన్ వెల్లడించారు. రష్యా దాడి గురించి తను చేసిన హెచ్చరికలను చాలమంది నమ్మలేదని, తమకు అందిన సమాచారం మేరకు తాము వెల్లడించామని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్ష్యుడు జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత అందరికీ ఒక కమాన్ డౌట్ రాక మానదు. అదేమిటంటే నాటో కు అద్యక్షత వహిస్తున్న అమెరికా ..హెచ్చరించినప్పటికి, నాటో సభ్యత్వం కోసం చూస్తున్న ఉక్రెయిన్ ఎందుకు వినలేదనే డౌట్ రాక మానదు. అంటే ఉక్రెయిన్, అమెరికను నమ్మడం లేదా అనే వాదన కూడా వినిపిస్తుంది. మరి ఉక్రెయిన్ నాటో లో చేరుతుందా ? లేక ఒంటరి దేశంగానే ఉంటుందా ? అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read

టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ..!

నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి..?

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -