Wednesday, April 24, 2024
- Advertisement -

కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తికి.. అమెరికా ప్రయాణంలో కొత్త ఆంక్షలు..!

- Advertisement -

కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఉత్తర్వులు జారీ అయితే జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీడీసీ, ఇతర పరిపాలన అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.

యూకేలో కరోనా స్ట్రెయిన్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెట్టింది. అయితే పలు దేశాల్లోనూ కరోనా కొత్త రకం వ్యాప్తి వెలుగుచూస్తుండడంతో అన్ని దేశాల ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనుంది.

ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం..!

హనీమూన్ ప్లాన్ గురించి చెప్పిన సింగర్ సునిత!

పండుగ నాడు శుభ వార్త.. భారత్ లో కొవిడ్ అంతం దిశగా..!

56.5లక్షల టీకా డోసులు.. వెల్లడించిన హర్​దీప్​ సింగ్​ పూరీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -