Monday, May 13, 2024
- Advertisement -

మాంచెస్ట‌ర్‌లో జ‌రిగిన ఆత్మాహుతిదాడిలో 19 మంది మృతి..50 మందికిపైగా గాయాలు

- Advertisement -
Suicide bombing in england 19 killed, and 50 others were injured

ఇంగ్లాండ్‌ పారిశ్రామిక నగరం మాంచెస్టర్ ర‌క్త‌సిక్త‌మైంది.సోమ వారం జ‌రిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర ప్రాణ న‌స్టాన్ని క‌లిగించింది.ఈదాడికి పాప్ప‌డింది తామే నంటూ ఉగ్ర‌మూక ఐసిస్ ప్ర‌క‌టించింది.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని… ముందు ముందు మరిన్ని భీకరదాడులు జ‌ర‌పుతామ‌ని హెచ్చ‌రించింది. ఐసిస్ సానుభూతి ప‌రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైశాచికానందం పొందుతున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి 10:30 సమయంలో అమెరికా పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన వద్ద ఈ దాడి జరిగింది. సంగీత ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులు ఎరీనా ఆడిటోరియం నుంచి ఇళ్లకు బయల్దేరారు. అందరూ ఎంట్రన్స్ గేటువద్దకు చేరుకుంటుండగానే అదను చూసి మానవబాంబు తనను తాను పేల్చేసుకున్నట్టు భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు 19 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు అనంతరం కొద్దిపాటి తొక్కిసలాట జరగడంతో మరికొందరు గాయపడినట్టు భావిస్తున్నారు.
యూరప్‌ దేశాల్లో ఐసిస్‌ స్లీపర్‌సెల్స్‌ యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని, ఏ నిమిషంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మే2న అమెరికన్‌ పర్యాటకులకు ఆ దేశ నిఘావర్గాలు సందేశాలు పంపాయి. అయితే వీటిని రొటీన్‌గా తీసుకున్న ఇంగ్లాడ్‌.. చివరికి భారీ మూల్యం చెల్లించుకుంది.

{loadmodule mod_custom,Side Ad 2}

మాంచెస్టర్‌ పరిస్థితులను అత్యంత సునిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. మిలిటెంట్లు మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉండడంతో బ్రిటన్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. దాదాపు 21 వేల మంది కూర్చోగల సామర్థ్యమున్న ఈ ఆడిటోరియంలోకి ఉగ్రవాదులు అంత సులువుగా ప్రవేశించడంతో… అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మాంచెస్టర్ దాడితో యూరోపియన్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రత కట్టుదిట్టం చేసి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -