Wednesday, April 24, 2024
- Advertisement -

మా, సినీ పెద్ద‌ల‌తో ముగిసిన త‌ల‌సాని భేటి.. వివాదాన్ని నిలిపివేయండి

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదా పెద్ద దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో తీనికి ముగింపు ప‌లికేందుకు సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మా, సినీ పెద్ద‌లు, పోలీసుల‌తో స‌మావేశ వ‌య్యి టీలీవుడ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు.

స‌మావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినీ పరిశ్రమలో మధ్యవర్తులు లేకుండా చూస్తామని, ఇకపై నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తామని సినీ పెద్ద‌లు చెప్పార‌ని తెలిపారు.

మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో నిలిపివేయాలని పరిశ్రమను, మీడియాను కోరుతున్నానని అన్నారు. మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఫిర్యాదుల కోసం ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. నటన శిక్షణా కేంద్రాలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇక వివాదాన్ని నిలిపివేయాలని పరిశ్రమను, మీడియాను మంత్రి కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు చెప్పారని మంత్రి మీడియాకు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -