Friday, May 3, 2024
- Advertisement -

ఆ నేతలకు ఇవే చివరి ఎన్నికలు!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఫైనల్‌గా రేసులో ఉన్న అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది. ఇక ఈ సారి ఎన్నికల్లో యువకులతో పాటు ఏడు పదుల వయస్సు ఉన్న నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు వయస్సు 79. తనకు ఇవే చివరి ఎన్నికలని సీఎం కేసీఆర్ సాక్షిగా చెప్పేశారు. ఆయన కొత్తగూడెం నుండి ఈసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇక బాన్సువాడ నుంచి ఆరుసార్లు గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డికి సైతం ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. పోచారం వయస్సు 74. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తన వారసుడికి ఛాన్స్ ఇవ్వాలని భావించినా సీఎం కేసీఆర్ కోరడంతో పోటీలో ఉన్నారు.

ఇక మరో సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఇంద్రకరణ్ వయస్సు 74 కాగా రెండు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే బీజేపీ నేత మర్రిశశిధర్ రెడ్డి,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత , సూర్యాపేట అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సైతం ఇవే లాస్ట్ ఎన్నికలు. ఇదే బాటలో మరికొంతమంది నేతలకు ఈ ఎన్నికలే లాస్ట్ కానుండగా ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -