Monday, April 29, 2024
- Advertisement -

అమ్మాయిలు ఎవరైనా రోడ్డుపై ఫోన్ తో కనపడినా.. మాట్లాడిన జ‌రిమానా

- Advertisement -

అమ్మాయిలు ఎవరైనా రోడ్డుపై ఫోన్ తో కనపడినా.. మాట్లాడుతూ కనిపించినా.. జ‌రిమానా క‌ట్టాల్సిందే. ఫోన్‌ల ముచ్చ‌ట్లు పెడితే పైస‌ల్ పోగొట్టుకోవాల్సిందే. ఫోన్ మాట్లాడ‌డం ద్వారా అమ్మాయిల‌పై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయ‌ని యూపీలోని ఓ గ్రామం గుర్తించి ఓ ప్ర‌త్యేక ప‌రిష్కారం క‌నుకుంది.

అమ్మాయిలు ఎవరైనా రోడ్డుపై ఫోన్ తో కనపడినా.. మాట్లాడుతూ కనిపించినా.. జరిమానా విధించాలని నిర్ణయించింది. తాజాగా ఓ యువతికి రూ.21వేలు ఫైన్ వేసింది పంచాయతీ. అమ్మాయిల వేషధారణ.. ఫోన్లలో కబుర్ల వల్ల అఘాయిత్యాలకు గురవుతున్నారని… అందుకే కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు పంచాయ‌తీ పెద్ద‌లు తెలిపారు. ఈ ఘ‌ట‌న బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్ర‌దేశ్‌ మధుర జిల్లాలోని మదోర గ్రామంలో జ‌రిగింది. అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీర్పు విధించ‌డంపై మండిప‌డుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సామాజికవేత్తలు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -