- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన బాబు!?

- Advertisement -

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ పార్టీ అధిష్టానం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం. కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో అధిష్టానం అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనను అసెంబ్లీ లాబీల్లో పిలిచి మాట్లాడారు.

సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం, సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఎన్నికల టికెట్ కోసం డబ్బులు వసూలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు, వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా పార్టీ నేతలను టార్గెట్ చేయడం వంటి వ్యవహారాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఇక సహించబోమని పల్లా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

పార్టీ వల్లే వ్యక్తికి గుర్తింపు వస్తుంది. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు అంటూ పల్లా గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. దీనికి స్పందించిన కొలికపూడి, అనుభవలేమి వల్ల తప్పులు జరిగాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమరావతి ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్న కొలికపూడి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వరుస వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. గతంలో కూడా అధిష్టానం మందలించినప్పటికీ మార్పు కనిపించకపోవడంతో ఈసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపై ఆయన తీరు ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -