- Advertisement -
ఏపీలో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే టీడీపీ నేతలు భూ దందాకు తెరలేపారు.
చంద్రబాబు ఇంటికి సమీపంలోనే జవాన్ భూమి ఆక్రమణకు తెర లేపారు టీడీపీ నేత సుందరప్ప. ఇండియన్ ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించారు టిడిపి నేత సుందరప్ప.
న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భూ బాధితుడు ప్రసాద్. తన కుటుంబానికి ఉన్న ఎకరా 20 సెంట్ల భూమిలో 15 సెంట్లు భూమి ఆక్రమించి, రీ సర్వేలో తన భార్య పేరుతో నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు న్యాయం చేసినా తన తండ్రి నారాయణప్పపై సుందరప్ప దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
