- Advertisement -

90 శాతం పెరిగిన త్రైమాసిక లాభం

- Advertisement -

టెక్ మహేంద్ర. ఐటి దిగ్గజం. లాభాల బాటలో ఉరుకులు పెడుతోంది. కన్నాలిడేటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుత అభివ్రద్ధిని సాధించింది. ఈ కంపెనీ నికర లాభం ఏకంగా 90 శాతం పెరిగి 897.08 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం 472 కోట్ల రూపాయలు. దాంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన లాభాలు రెట్టింపు అయ్యాయి.

ఈ త్రైమాసికంలో కంపెనీ రాబడులు 6,616 కోట్ల రూపాయల నుంచి 6,883 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 26,494 కోట్ల రూపాయల రాబడులు రాగా3118 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. దీంతో పాటు కంపెనీ పన్నుల కోసం చేసిన కేటాయింపులు కూడా 157 కోట్ల రూపాయలకు తగ్గాయని కంపెనీ పేర్కొంది.

2014 – 2015 సంవత్సరంలో రెండు కంపెనీలు కొనుగోలు చేయడంతో లాభాల వాటా తగ్గిందని, అయితే ఇప్పుడు ఆ రెండు కంపెనీల పనితీరు మెరుగుపడడంతో లాభాల వాటా పెరిగిందని కంపెనీ చెబుతోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -