Monday, May 13, 2024
- Advertisement -

పొగిడేశారు: వీళ్లకూ వైఎస్ గుర్తుకొచ్చాడు!

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇమేజ్ ను వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధపడినట్టుగా లేదు. జగన్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకొన్నప్పటి నుంచి వైఎస్ పేరు ప్రస్తావించడం క్రమంగా తగ్గించేసింది కాంగ్రెస్ పార్టీ.

ఉమ్మడి రాష్ట్రంలో. .వైఎస్ అనంతరం ముఖ్యమంత్రులు అయిన రోశయ్య కానీ.. కిరణ్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ ఇమేజ్ అనవసరం అన్నట్టుగా వ్యవహరించారు. వీరిలో కిరణ్ అయితే.. వైఎస్ కన్నా తనే గొప్ప నేతను అన్నట్టుగా  వ్యవహరించసాగాడు.

అందుకు తగ్గట్టైన పరిణామాలూ సంభవించానుకోండి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లోనూ గల్లంతయిపోయింది. ఇక మరణించిన వైఎస్సార్ ను సీబీఐ చార్జిషీట్ లోకి చేర్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఎక్కడ వైఎస్ వల్ల జగన్ కు పేరొచ్చేస్తుందో.. అనేభయంతోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్  పేరును డ్యామేజ్ చేయడానికి అప్పట్లో ప్రయత్నించింది. మరి అప్పటి సంగతలా ఉంటే.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఇమేజ్ అవసరం అయినట్టుగా ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు వైఎస్ ను స్మరిస్తున్నారు.

వైఎస్ జయంతి సందర్భంగా ఆయనను తలుచుకొన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైఎస్ ను స్మరించారు. వైఎస్ వల్లనే మెట్రో రైలు, శంషాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణం సాధ్యం అయ్యిందని వీరు తలుచుకొన్నారు. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి హారాలు వేసి అంజలి ఘటించారు. మరి కాంగ్రెస్ కు ఇప్పడు తెలంగాణ వరకూ అయినా వైఎస్ ఇమేజ్ సొంతం అవుతుందా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -