- Advertisement -

బీరు ప్రియుల‌కు షాక్ ఇచ్చిన తెలంగాణా…

- Advertisement -

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. బీర్ల ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఒక్కో బీరు బాటిల్‌ రూ. 10వరకు పెరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేస్తూ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

పెరిగిన ధ‌ర‌ల‌తో లైట్ బీరు రూ. 120కి, స్ట్రాంగ్ బీరు రూ. 130కి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ. 10 అదనంగా వీటిని విక్రయించనున్నారు. తాజా పెంపుతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 కోట్ల అదనపు రాబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెలకు రూ.25 కోట్ల అదనపు లాభం రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -