Wednesday, May 15, 2024
- Advertisement -

తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి కట్టాల్సిందే.. ఉత్తర్వులు జారీ!

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తుంది. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్రితి పెరిగిపోతుంది. ఇప్పటికే వందల్లో ఉన్న కేసులు వేల సంఖ్యకు పెరిగిపోయింది. తెలంగాణలో కరానా ధాటికి కేసులు, మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతుంది.

ఇందులో భాగంగా మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో.. పనిచేస్తున్న కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు.  అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులను పంపించారు.

బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, పనిచేసే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించని వారి వివరాలు, ఫొటోలు సేకరిస్తున్నారు. మరోసారి మాస్క్‌లు వేసుకోకుంటే షాపులు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నిత్యమూ ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ, మాస్క్ లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

పవన్ కళ్యాన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు

72 గంట‌ల్లో 12 మంది ఉగ్ర‌వాదులు హ‌తం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -