- Advertisement -

వెదర్ అప్‌డేట్…ప్రజలకు అలర్ట్

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 17,18 తేదీలలో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది.

రాజస్థాన్‌లో ఏర్పడిన వాయుగుండం, ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్‌లో అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా, రాయలసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

18, 19 తేదీల్లో కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, లక్షద్వీప్‌లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -