Sunday, May 5, 2024
- Advertisement -

సంచలనంగా మారుతున్న న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య

- Advertisement -

ఒక న్యూస్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న రాధిక ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి 10.40గంటలకు డ్యూటీ ముగించుకుని మూసాపేట్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌కి వచ్చిన రాధిక సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న తన ఫ్లాట్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఐదో ఫ్లోర్‌కి వెళ్ళింది. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘తన చావుకు ఎవరూ కారణం కాదు….నా బ్రెయినే నా చావుకు కారణం’ అని రాధిక సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయినప్పటికీ మీడియా జనాలు ఎదుర్కుంటున్న సమస్యలు, స్ట్రెస్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతోంది.

ఆరు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు రాధిక. వ్యక్తిగతంగా ఆమెకు ఉన్న సమస్యలు పక్కనపెడితే పని వాతావరణం, స్ట్రెస్ కూడా రాధికకు జీవితంపై ఆసక్తి పోయేలా చేసిందని చెప్పి ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న మీడియా సంస్థలన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేవే కావడంతో ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్న సంతృప్తి జర్నలిస్టులకు లేకుండా పోతోంది. కేవలం జీతాల కోసం పనిచేస్తున్న చందంగానే జర్నలిస్టుల జీవితాలు తయారవుతున్నాయన్నది నిజం. ఆత్మసంతృప్తి లేకుండా పోవడంతో స్ట్రెస్ పెరిగిపోతోంది. దాదాపుగా మీడియాలో పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ రీడర్స్‌ది ఇదే పరిస్థితి. అధికారంలో ఉన్న వాళ్ళ భజన చేస్తూ మీడియా యాజమాన్యాలు మాత్రం బాగానే లాభపడుతున్నాయి. కానీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. రాధిక మరణం తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న, స్ట్రెస్ దెబ్బకు అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టుల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజల జీవితాలను ఉద్ధరించడానికే పుట్టాం అని చెప్పుకునే మీడియా సంస్థల యాజమాన్యాలు కనీసం ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాల గురించి అయినా కాస్త సహృదయంతో ఆలోచిస్తాయేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -