- Advertisement -

జోస్‌ అలుక్కాస్ షోరూమ్‌లో భారీ చోరీ!

- Advertisement -

పంజాగుట్టలోని జోస్‌ అలుక్కాస్ జువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. షోరూమ్‌లో పనిచేస్తున్న ఓ సేల్స్‌మ్యాన్ కిలోకుపైగా బంగారం బిస్కెట్లు దొంగిలించినట్లు గుర్తించారు. ఆడిటింగ్ సమయంలో స్టాక్‌లో తేడాలు గమనించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, నిందితుడు బంగారం బిస్కెట్లను సాక్స్‌లో దాచుకుని షోరూమ్ నుంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొంతకాలంగా ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

షోరూమ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ అయిన బంగారం మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -