Saturday, April 27, 2024
- Advertisement -

మళ్లీ చుక్కలనంటుతున్న బంగారం.. అదే బాటలో వెండి!

- Advertisement -

బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కరోనా ప్రభావంతో పసిడి ధర తగ్గుతుందని భావించినా.. అమాంతం రేటు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ మద్య పసిడి ధర తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇదే బాటలో వెండి కూడా తగ్గుతూ వచ్చింది. తాజాగా మరోసారి బంగారం ధర పెరిగిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దూసుకువెళ్లింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగింది. దీంతో రేటు రూ.46,090కు చేరింది.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.600 పెరుగుదలతో రూ.42,250కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.

తాజాగా రూ.650 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,440కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.600 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.44,400కి అయింది. ఇక వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.1,300 పెరిగింది. కేజీ వెండి ధర రూ.70,000కు చేరింది.

నేటి పంచాంగ, ఆదివారం (4-4-2021)

నివేదా థామస్ కి కరోనా పాజిటీవ్!

ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు.. ఎక్కడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -