Sunday, May 12, 2024
- Advertisement -

టీడీపీ, బీజేపీల బ్రేకప్ కు సమయమొచ్చేసిందా..?!

- Advertisement -

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు మొన్నటిఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. పాత గొడవలు అన్నీ పక్కనపెట్టి పదేళ్ల తర్వాత రెండు పార్టీలూ చేతులు కలిపాయి.

పదేళ్ల కిందట దూరం అయిన అధికారాన్ని సొంతం చేసుకొన్నాయి. ఎన్నికల్లో లభించిన విజయంతో ఈ ఇరు పార్టీలూ అధికారాన్ని ఆస్వాధిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ రెండు పార్టీల మధ్య బ్రేకప్ కు సమయం వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అతి త్వరలోనే బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాల స్థానాల నుంచి వైదొలగవచ్చని సమాచారం. దీనికి కారణం ఏమిటంటే.. టీఆర్ఎస్! ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం గురించి తెలంగాణరాష్ట్ర సమితి తన కోరికను బయటపెట్టేసుకొంది. స్వయంగా కవిత వంటి వాళ్లు ఈ అంశం గురించి క్లారిటీఇచ్చారు. దీన్ని బట్టి బీజేపీ పిలవడమే ఆలస్యం.. తెరాస వెళ్లి ఆ పార్టీతో చేతులు కలపగలదు!

మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఎన్డీయే నుంచి బయటకు రావాల్సి రావొచ్చు. తెలంగాణ తెరాసపై దుమ్మెత్తిపోసే ఈ పార్టీ తెరాస భాగస్వామిగా ఉన్న కూటమిలో ఉంటే అంతకన్నా దారుణం ఉండదు. ఇక బీజేపీ కూడా ఏపీకి చేస్తున్నది ఏమీ లేదు! ప్రత్యేక హోదా అంశం గురించి బీజేపీ స్పందిస్తున్నతీరు ఏపీజనాలకు బీపీని తెప్పిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి.. బీజేపీపై దుమ్మెత్తిపోయడానికి అవకాశం ఉంది. అయితే తెలుగుదేశాధినేతకు అంత ధైర్యం ఉందా? అనేదే సందేహం! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -