ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేసు న‌మోదు..

- Advertisement -

ఐటీ గ్రిడ్స్’ కంపెనీ డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది. ఈ వ్య‌వ‌హార రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసుపై తెలంగాణా ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేయ‌డంతో బాబుకూడా అదే దారిలో వెల్తున్నారు. టీడీపీకీ చెందిన డేటాను దొగింలించార‌ని బాబు కూడా సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. తాజాగా సీఎం చంద్ర‌బాబుపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసున మోదు అయ్యింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసుల సోదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారు. ఏపీ సీఎం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -