Saturday, May 4, 2024
- Advertisement -

ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం….

- Advertisement -
trump and vladimir putins focus shift to north korea

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ …. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు పోన్ చేయ‌డం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.కిమ్ తో చర్చలకు తాను సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించి గంటలు కూడా గడవక ముందే… ట్రంప్, పుతిన్ లు ఫోన్ సంప్రదింపులు జరపడం చర్చనీయాంశం అయింది.సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడులను అమెరికా, రష్యాలు ఆపేయాలని నిర్ణయించుకున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఇప్పుడు రెండు అగ్రదేశాల దృష్టి ఉత్తర కొరియాపైకి మళ్లిందా అంటే అవునని చెప్పవచ్చు.అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను ఫోన్‌లో సంప్రదించారని, సిరియాలో తమ దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని చర్చించినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయంకరమైన ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఇరు దేశాలు అందించుకున్న సహకారంపై అగ్రనేతలు చర్చించారు. సిరియాలో ఇకనుంచి దాడులకు ముగింపు పలకాలని, అక్కడ ఉగ్రవాదంపై చేసిన పోరును తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్, పుతిన్‌లు ఓ నిర్ణయానికి వచ్చారు. అస్టానా, కజకిస్తాన్ లలో కాల్పుల విరమణ ఒప్పదంపై చర్చకుగానూ బుధ, గురువారాల్లో అమెరికా తమ ప్రతినిధిని పంపాలని నిర్ణయించింది. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం.

కిమ్‌తో తాను భేటీ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్, పుతిన్‌ను ఫోన్‌లో సంప్రదించడం చర్చనీయాంశమైంది.అణుపరీక్షలు ఆపివేస్తేనే కిమ్‌తో శాంతియుత చర్చలు సాధ్యమని రెండురోజుల కింద ట్రంప్ ప్రకటించగా.. అమెరికా ఆంక్షలకుభయపడే ప్రసక్తే లేదని… ఏక్షణంలో అయినా అమెరికాపై అణు దాడులు చేసేందుకు తాము సిద్ధమంటూ కిమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. కిమ్ కు ముకుతాడు వేయాలంటే రష్యా మద్దతు ఉండాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మొండి వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టి… పుతిన్ తో ట్రంప్ చర్చలు జరిపారని విశ్లేషకులు భావిస్తున్నారు.జూలైలో జరగనున్న జీ20 దేశాల సదస్సు సందర్భంగా నేరుగా కలుసుకుని మరిన్ని అంశాలపై చర్చించడానికి పుతిన్ ఆహ్వానం పలికారు.

Related

  1. ప్ర‌త్యేక‌హోదాకు దిక్కులేదు గాని.. ఆస్కార్ అవార్డు అవసరమా..
  2. ప‌వ‌ణ్ పేప‌ర్ పులినా……?
  3. యుద్ధం చేయ‌డానికి సిద్ధం …క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్త‌ర కొరియా ..
  4. టీడీపీ లో అవమానాలు తట్టుకోలేక సొంత‌గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -