Sunday, May 5, 2024
- Advertisement -

లాభాల బాట పట్టించాలని ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు రోజుకు రెండు కోట్ల రూపాయల నష్టం వస్తోంది. దీన్ని నుంచి బయటపడేందుకు మార్గాన్వేషణలో పడింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ప్రయాణీకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆర్టీసికి హైదరాబాద్ నగర పాలక సంస్ధ నుంచి 18 కోట్ల రూపాయల సాయం మాత్రమే అందుతోంది. అలాగే ఇతర రాష్ట్రాల ఆర్టీసితో పోలిస్తే తెలంగాణలోనే టిక్కట్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని, అయినా ప్రజలకు మెరుగైన సేవలే అందించగలుగుతున్నామని ప్రభుత్వం భావిస్తోంది. బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతోంది. ఇందులో భాగంగా జంటనగరాలతో పాటు ముఖ్యమైన జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆటోలపై పాక్షిక నిషేదాన్ని విధించాలని భావిస్తోంది.

అలాగే పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శిరిడిలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తిలకు ప్రత్యేక బస్సులు వేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నా అందులో ఉన్నతాధికారులే ఎక్కువని, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు తక్కువగానే ఉన్నారని లెక్కలు తీసింది. దీనిని ద్రష్టిలో ఉంచుకుని అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేసి అవసరమైన డిపోల్లో డ్రైవర్లు, మెకానిక్ లను తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. గతంతో రవాణ శాఖ మంత్రిగా పని చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -