Sunday, May 5, 2024
- Advertisement -

పెరుగుతున్న కొత్త కరోనా.. భారత్ లో 20 కి చేరిక..!

- Advertisement -

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మరింత ఉధృతం అవుతుంది. ఇప్పుడు కొత్త రకం యూకే స్ట్రెయిన్​ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటి వరకు యూకే స్ట్రెయిన్​ రకం​ కేసులను 20 గుర్తించినట్లు జీనోమ్​ సీక్వెన్సింగ్​ ప్రయోగశాల ప్రకటించింది. ఈ కొత్త రకం వైరస్​​ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను.. సంబంధిత అధికారులు వెల్లడించారు.

నవంబర్​ 25 నుంచి డిసెంబర్​ 23 వరకు దాదాపు 33వేల మంది ప్రయాణికులు బ్రిటన్​ నుంచి భారత్​లోని వివిధ ప్రాంతాలకు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరందరిని కనుగొని.. వారికి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటి వరకు 114 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీరి శాంపిళ్లను సార్స్ కోవ్​-2 వైరస్​ను గుర్తించే ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపింది.

తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఐసీఎంఆర్​ సలహాదారు డా.సునీలా గార్గ్​.. తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూకే నుంచి అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 31​ వరకు రద్దు చేసింది భారత ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -