Saturday, May 4, 2024
- Advertisement -

టిట్ ఫర్ టాట్…… రాధాకృష్ణను, జ్యోతిని బహిష్కరించిన ఉత్తరాంధ్ర ప్రజలు

- Advertisement -

సరదా తీరింది…….. చంద్రబాబునాయుడిలాంటి నాయకుడి సపోర్ట్ ఉందనో……. లేక ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతూ పబ్బం గడుపుకున్న నైజం వళ్ళ వచ్చిన మధ్యంతరసిరినో……. వేరే ఏ కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఉండే గర్వం ఆయన ప్రతి కదలిక, మాటలోనూ కనిపిస్తుంది. ఇక ఇంటర్యూ చేసే సమయంలో కూడా ఒక్క చంద్రబాబు ఎదురుగా ఉన్నప్పుడు తప్పితే ఇతరులను ఎవరిని ఇంటర్యూ చేసేటప్పుడు అయినా వెకిలిగా నవ్వడం, ఏక వచనంలో సంభోదించడం, పెద్ద పెద్ద వాళ్ళ విషయంలోనూ లూజ్ టంగ్‌తో మాట్లాడడం రాధాకృష్ణకు నిత్యకృత్యం. ఈ స్థాయి గర్వం ఉన్న జర్నలిస్ట్ ప్రస్తుత కాలంలో ఇంకెవ్వరూ కనిపించరు. అన్నింటికీ మించి అంతకుముందు ఎలా ఉన్నా నారా వారి సపోర్ట్‌తో ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చాక మాత్రం అచ్చంగా చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు నడుస్తూ ఉన్న సత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. టిడిపి సానుభూతిపరులకు కూడా ఈ విషయం తెలుసు. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్‌ని కూడా మంచి చేసుకున్నాడు.

అధికార పార్టీలకు, నాయకులకు భజన చేసి బ్రతికేస్తూ ఉండే మీడియా సంస్థ అధినేతకు ప్రజలను కామెంట్ చేసే అర్హత ఉందా? ప్రజల జీవితాలను వెటకారం చేయడం న్యాయమా? గతంలో హోదా పోరాటం, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా సీమాంధ్ర ప్రజల గురించి ఘోరంగా వెకిలి కామెంట్స్ చేశాడు రాధాకృష్ణ. ఇప్పుడు ఆ పైత్యం ఇంకాస్త ముదిరి….‘ఆంధ్రవారికి……..ముఖ్యంగా ఉత్తరాంధ్రవారికి పొటకోస్తే అక్షరం ముక్క హిందీ రాదు కదా…….’ అని వెకిలి వ్యాఖ్యలు చేశాడు. ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్ర ప్రజలందరినీ నొప్పించే ఆ మాటలు అదే ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన టిడిపి ఎంపికి సరదాగానే అనిపించినట్టున్నాయి. ఎంతైనా ‘మన పార్టీ’ అని స్వయంగా టిడిపి జర్నలిస్ట్‌ని ఒప్పుకున్న రాధాకృష్ణ కదా………అందుకే ఆ టిడిపి ఎంపికి గొప్పగా అనిపించాయేమో ఆ మాటలు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మాత్రం ఆ టిడిపిలా సిగ్గులేకుండా ఉండలేకపోయారు. రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. మీడియా మొత్తం టిడిపి చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ విషయం మెయిన్‌స్ట్రీమ్ మీడియా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలని చెప్పి ఏకంగా ఉద్యమం లేవదీశారు. ఆంధ్రులను అవమానించిన రాధాకృష్ణతో పాటు ఆంధ్రజ్యోతి మీడియాను కూడా బహిష్కరిస్తున్నట్టుగా వాల్ పోస్టర్స్ అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు టిడిపి నేతల స్టాండ్ ఎటువైపు ఉంటుందో చూడాలి. తెలంగాణా ప్రజాప్రతినిధులను ఒక్క మాట అన్నందుకు ఏకంగా టివి9ని బ్యాన్ చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రతో పాటు ఉత్తరాంధ్రను కూడా ఘోరంగా అవమానించిన రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే శ్వాస తీసుకుంటున్న అనే స్థాయిలో కబుర్లు చెప్పే చంద్రబాబు ఏ విధంగా శిక్షిస్తాడు? కేసీఆర్ చేసినట్టుగానే ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయగలడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -