Friday, May 3, 2024
- Advertisement -

పవన్ సమరవాణి.. వైసీపీపై నిప్పులు చెరిగిన జనసేనాని !

- Advertisement -

ఈ నెల 15న విశాఖలో జరిగిన పోలిటికల్ వార్ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణకు మద్దతుగా.. వైసీపీ నాన్ పోలిటికల్ జె ఏ సి తో ” విశాఖ గర్జన ” ను ఏర్పాటు చేయగా, జనసేన పార్టీ కూడా అదే రోజూన పవన్ పర్యటనను ప్రారంభించడంతో ఇరు పార్టీల మద్య రాజకీయ వేడి తారస్థాయిలో నెలకొంది. జనసేన కార్యకర్తలు, వైసీపీ నేతల కాన్వాయ్ లపై దాడులకు పాల్పడడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే. ఇక విశాఖలో 16న నిర్వహించాల్సిన ” జనవాణి ” కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడడంతో పవన్ జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఇక తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పవన్ జగన్ పాలనపై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వంలో ఉంటూ గర్జన పేరుతో నిరసనలు తెరపడం ఏంటని పవన్ ప్రశ్నించారు. కడుపు కాలినవాడు గర్జిస్తాడు అధికారంలో ఉన్నవారికి గర్జించాల్సిన అవసరం ఏంటని జనసేనాని ద్వాజమెత్తారు. అలాగే మూడు గర్జన సభలో పవన్ మూడు పెళ్లిలపై సెటైర్లు విరిసిన వైసీపీ నేతలుకు పవన్ కౌంటర్ వేశారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మూడు రాజధానులు పెడతారా అంటూ నిలదీశారు.

ఒకే రాజధాని ఉండాలని, రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తాం అంటే ఎలా అని ఆగ్రహించారు. ఉత్తరాంధ్రలో పర్యటన మూడు నెలల క్రితమే ప్రణాళిక వేశామని, హటాత్తుగా పెట్టిన కార్యక్రమం కాదని జనసేనాని ద్వాజమెత్తారు. తనకు పోలీసులంటే గౌరవం ఉందని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తి కింద పోలీసులు పని చేస్తున్నారని.. జగన్ను ఉద్దేశించి పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గంజయ్ సరఫరా చేసే వారికి పర్మిషన్ ఇవ్వండి.. తప్పు చేసే నేతలకు కొమ్ముకాయండి.. కానీ ప్రజాసమస్యలు వినిపించే వారికి మాత్రం పర్మిషన్ ఇవ్వకండి అంటూ పవన్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇలా మొత్తానికి ఉత్తరాంధ్రలో పవన్ పర్యటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన బ్యాన్ !

చంద్రబాబు vs సీనియర్ ఎన్టీఆర్.. తప్పు ఎవరిది ?

జగనన్న” సినిమా “.. అదిరిపోయే ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -