Friday, May 3, 2024
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌

- Advertisement -
Who will be the President and Vice President of India in 2017..?

త్వ‌ర‌లో రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ముగియ నున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప్ర‌ణ‌బ్ స్థానంలో కొత్త వారు ఎవ‌ర‌నే దానిపై రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఎన్‌డీఏ త‌మ అభ్య‌ర్తి ఎవ‌ర‌నేదానిపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం ….కాంగ్రెస్ దాని మిత్ర ప‌క్షాలు క‌ల‌సి ఉమ్మ‌డి అభ్య‌ర్తిపై ముమ్మ‌ర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

ఈ ఎన్నికకు సంబంధించి చిత్రమైన కాంబినేషన్లు తరచూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాస్త‌వానికి రాష్ట్ర ప‌తిని ఎన్న‌కొనేందుకు భాజాపాకు రాజ్య‌స‌భ‌లో త‌గినంత బ‌లంలేక‌పోవ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డింది.ఇక కాంగ్రెస్ ,దాని మిత్ర ప‌క్షాలకు ఎక్కువ బ‌లం ఉండ‌టంతో త‌మ అభ్య‌ర్తిని బరిలోకి దింపి భాజాపాను పూర్తిగా ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేసింది.ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పేరును తెర‌పైకి తీసుకొస్తున్నాయి. అయితే భాజాపా మాత్రం సుముఖంగాలేదు.సొంతంగా రాష్ట్ర‌ప‌తిని ఎన్న‌కోకుంటే అద మోదీకే అవ‌మానం.
ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ దాను కానీ తమ అభ్యర్థిగా మోడీ సర్కారు ఖరారు చేస్తే.. తాము సైతం మద్దతు ఇస్తామని కాంగ్రెస్ తన మాటగా చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిని బరిలోకి దించాలన్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తోంది. ఇందుకోసం కసరత్తు చేస్తోన్న ఆ పార్టీ ప్రణబ్ ను బరిలోకి తీసుకురావటం ద్వారా మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.ఇప్ప‌టికే రెండోసారి రాష్ట్ర‌ప‌తిగా ఉండ‌డానికి విముఖ‌త వ్య‌క్తం చేశారు.
భాజాపా త‌రుపున ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వారిలో వెకంయ్య‌నాయుడు ఉండ‌టం గ‌మ‌న‌ర్హం.ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంక‌య్య‌నాయుడు ప్రస్తుతం కేంద్రంలో పట్టణాభివృద్ధి సమాచార-ప్రసారశాఖ నిర్వహిస్తున్నారు.నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించిన మొదటి నాయకుల్లో ఒకరు. దక్షిణాదిలో విస్తరించాలని ఉరకలేస్తున్న కాషాయపార్టీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}
ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము మహిళా రాజకీయవేత్త ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. 2000-04 మధ్యకాలంలో ఒడిశా బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈమెకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మహిళ కావ‌డంతోపాటు గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ రకంగానూ మద్దతు కూడగట్టవచ్చు. రాష్ర్టానికి చెందిన అభ్యర్థి కాబట్టి ఒడిశా పాలకపక్షమైన బీజేడీ కూడా ఆమెను బలపర్చాల్సి రావచ్చు.
లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మహాజన్ తోపాటు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సుస్మాస్మ‌రాజ్ పేర్లుకూడా వ‌నిపిస్తున్నాయి. 2014లో లోక్సభ స్పీకరగా ఎన్నిక‌య్యారు.ఎనిమిదిసార్లు మధ్యప్రదేశ్ లోని ఇండోర్నుంచి లోక్ సభకు ఎనికయ్యారు.అయితే విపక్షాలు ఆమె తటస్థతను అనేకసార్లు ప్రశ్నించాయి. సుష్మా విష‌యానికి వ‌స్తె విదేశాంగశాఖను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న రెండో మహిళ. ఏడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మూడుసార్లు అసెంబ్లీకి ఎనికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 1977లో అతిపిన్నవయస్సులో తన 25వ ఏట హర్యానా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అన్ని పార్టీల్లో ఆమెకు మిత్రులున్నారు కాబ‌ట్టి విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధనకు సుష్మా అభ్యర్థిత్వం బీజేపీకి ఉపకరించవచ్చు. ఏది ఏమైనా ఎన్‌డీఏకు అధిక మెజార్టీ లేక‌పోవ‌డంతో అంద‌రికీ ఆమోద‌యేగ్య‌మైన అభ్య‌ర్తిని ఎన్న‌కోక త‌ప్ప‌దు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -