Friday, March 29, 2024
- Advertisement -

తలవంచిన టీడీపీ, వైసీపీ .. అసలెందుకు ?

- Advertisement -

ఏదైనా రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా అధికార ప్రతిపక్షల పార్టీల మద్య ఎప్పుడు వైరం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరు చేసే పనిని ఇంకొకరు అసలు సమర్థించరు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య వున్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఏపీలో టిడిపి, వైసీపీ మద్య ఉన్న రాజకీయ వైరం ఎప్పుడు కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఉప్పు నిప్పు లాగా ఉండే ఈ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాత్రం ఒకే వైకరి అవలంభించడం కొత్త చర్చలకు తావిస్తోంది.

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ఎన్డీయే కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ద్రౌపది ముర్ము కు అన్నీ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉంచితే ఏపీకి అన్నీ విధాలుగా అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయ్యడం మాని, కేంద్రం నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి విభజన టైమ్ లో ప్రతిపాదించిన ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదనేది జగమెరిగిన సత్యం. ఏపికి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్రంట్, విశాఖా రైల్వే జోన్ వంటి ఎన్నో హామీలను కేంద్రం దాటవేస్తోంది. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడమొఖం పెడమొఖం గానే ఉంటూ వచ్చారు. అలాంటిది ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ అభ్యర్థి కి ఎందుకు మద్దతు ఇస్తున్నారు ? అని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.. ఇక వైఎస్ జగన్ విషయానికొస్తే.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా ఇచ్చేవరకు ..అడుగుతూనే ఉంటా అని చెప్పిన జగన్.. అడగాల్సిన టైమ్ వచ్చినప్పుడు సైలెంట్ గా ఎందుకు మద్దతిస్తున్నారు ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఒకే వైఖరి చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం వెనుక వారి రాజకీయ స్వలాభం తప్ప.. రాష్ట్ర ప్రయోజనలు ఏవి లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

పార్లమెంట్ పై జాతీయ చిహ్నం.. మోడి పై విమర్శలు!

మోడి పాలనలో దేశం వెనుకడుగు.. ఆధారాలతో ?

తెరపైకి తమిళ రాజకీయాలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -