Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌శ్నించె ట్విట్ట‌ర్‌ ప‌వ‌న్ ఎక్క‌డ‌…

- Advertisement -

ప్ర‌జ‌ల త‌రుపును ప్ర‌శ్నించ‌డానికె జ‌న‌సేన పార్టీని స్థాపించాన‌ని ప‌వ‌న్ ఎక్క‌డ‌..?మొద‌ట భాజాపా-టీడీపీల‌కు మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌ర్‌స్టార్ త‌ర్వాత దూరంగా జ‌రిగారు.2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల త‌రుపున అప్పుడ‌ప్పుడు సాషియ‌ల్ మీడియాలో స్పందిస్తుంటారు.
ప్ర‌శ్నించ‌డానికె పుట్టిన ప‌వ‌న్ ఇప్పుడు ఎక్క‌డున్నార‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఉద్దానంలో ప‌ర్య‌టించి కిడ్నీ భాధిత‌ల‌ను ప‌రామ‌ర్శించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలోను కదలిక వచ్చింది. ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పవన్ సిద్ధమన్నారు.
ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య ఎందుకు వచ్చిందనే అంశంపై పరిశోధించేందుకు హార్వార్డ్ విశ్వవిద్యాలయ డాక్టర్లు రానున్నారు. ఈ నెల 31వ తేదీన వారితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ అమెరికాలో పర్యటించారు. హార్వార్డ్‌లో ప్రసంగిస్తూ.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య గురించి ప్రస్తావించారు. పవన్ కోరిక మేరకు ఏపీకి వచ్చి సమస్య తెలుసుకోవాలని హార్వార్డ్ నిపుణులు నిర్ణయించారు. వారు తొలుత చంద్రబాబుతో సమావేశమై.. ఆ తర్వాత ఉద్దానం వెళ్తారని తెలుస్తోంది.
ఇంత వ‌ర‌కు బాగానె ఉంది.మ‌రి ఇప్పుడు గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్య‌తిరేకంగా మూడు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తున్నారు.గ‌తంలో కూడా ప‌వ‌న్ వారిని ప‌రామ‌ర్శించి మ‌ద్ద‌తు తెలిపారు.అవ‌స‌రం అనుకుంటె తానె ఉద్య‌మం చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు.
ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు చేజారిపోయాయి. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించొద్దంటూ మూడేళ్లుగా తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు.. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
గ్రామస్తుల నుంచి ఇక్కట్లు రాకుండా ప్రభుత్వం గురువారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది పోలీసులను అక్కడికి తరలించింది. మెగా ఆక్వాఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నేతలు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వరరావు తదితరులను అరెస్ట్‌ చేసి మొగల్తూరు స్టేషన్‌కు తరలించారు. ఇది అన్యాయమంటూ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళలను ఈడ్చుకుంటూ వ్యాన్లలో ఎత్తిపడేసి.. బలవంతంగా అరెస్ట్‌ చేశారు. మ‌రి ప‌వ‌న్ ఇప్పుడు ఎందుకు స్పందించ‌డంలేద‌న్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.క‌నీసీ ట్విట్ట‌ర్ ద్వారానైనా స్పందించ‌క‌పోవ‌డం ఎంత ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -