- Advertisement -

ఈ రెడ్డిగార్లకు బాబు నిజంగానే మంత్రి పదవులు ఇస్తాడా?!

- Advertisement -

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. సతీష్ రెడ్డి.. ఇప్పుడు ఈ ముగ్గురూ మంత్రి పదవుల మీద బోలెడు ఆశలతో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటలేని ఈ ముగ్గరూ బాబు దయచేతన ఎమ్మెల్సీ పదవులను సొంతం చేసుకొని ఇప్పుడు..

మంత్రి పదవులపై ఆశలతో ఉన్నారు. త్వరలో జరిగే  ఏపీ క్యాబినెట్ పునర్వ్యస్థీకరణలో తమకు స్థానం దక్కుతుందని వీరు బోలెడన్ని ఆశలు పెట్టుకొన్నారు. 

తెలుగుదేశం తరపున నిబద్ధతో పనిచేస్తున్న తమకు మంత్రి పదవులు లభించడం న్యాయమే అని వీరి వాదన. మరి వాదనలు ఎలా ఉన్నా.. బాబు వీరిపై జాలి చూపుతాడా? అనేదే ప్రశ్నార్థకం. వీరి లో ముందుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనితీరును పరిశీలిస్తే.. ఈయన పక్కా పచ్చ చొక్కాలా వ్యవహరిస్తాడు. బాబుపై ఈగవాలనీయడు.. వైఎస్ జగన్ పై అనునిత్యం దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు.

ఇక మాగుంట తాజాగానే ఎమ్మెల్సీ అయ్యాడు. కుటుంబ నేపథ్యం తనకు బాబు చేత మంత్రి పదవిని ఇప్పిస్తుందని ఆయన ఆశలు పెట్టుకొన్నాడు. ఇక సతీష్ రెడ్డి విషయానికి వస్తే.. ఈయన కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నేత. అది కూడా పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేత. ప్రస్తుతానికి అయితే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్నాడు. బాబుకు తనకు మంత్రి పదవి ఇస్తాడని.. తనకు పదవి ఇవ్వడం పార్టీకి కూడా అవసరం అని సతీష్ రెడ్డి భావన. 

 

అయితే వీరంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడితే కానీ ఈ కులస్తులకు అంతో ఇంతో గుర్తింపు కూడా దక్కదు. ఇలాంటి నేపథ్యంలో త్వరలోనే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జరగనుంది. మరేం జరుగుతుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -