షర్మిల పరామర్శయాత్ర

వైసిపి నాయకురాలు షర్మిల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరామర్శయాత్ర చేస్తున్నారు.ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన షరమిల…. హైటెక్‌సిటీ, కొండాపూర్‌, మియాపూర్‌ మీదుగా చందానగర్‌ చేరుకున్నారు.

అక్కడ తారానగర్‌ తుల్జాభవన్‌ దేవాలయం సమీపంలో ఉంటున్న దిగంబరరావు ఇంటికి వెళ్లి… ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చిన ఆమె, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూసాపేటలో నోముల రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.