- Advertisement -

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా నీరాజ‌నం ప‌డుతున్న ప్ర‌జ‌లు

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన మ‌హాసంక‌ల్ప ప్ర‌జా పాద‌యాత్ర న‌ర్విరామంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర పొడ‌వునా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.తాజాగా పాద‌యాత్ర 200 కి.మీ మైలు రాయిని చేరుకుంది.

పాద‌యాత్ర‌లో వైసీపీ అధికారంలోకి వ‌స్తె అమ‌లు చేసే ప‌థ‌కాల‌ను వివ‌రించ‌డంతోపాటు రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతున్నారు జ‌గ‌న్‌. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో 200 కిలోమీటర్లు నడిచినట్లు అయింది.

ప్రజాసంకల్పయాత్రతో తమ కష్టాలను తెలుసుకోవడానికి వస్తున్న వైఎస్‌ జగన్‌ కోసం ముద్దవరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ముద్దవరం గ్రామం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎండను సైతం లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ ప్రజలు కోసం తరలివస్తున్నారు. తమ బాధలను జననేతతో చెప్పుకుంటున్నారు. ముద్దవరం గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -