Tuesday, May 14, 2024
- Advertisement -

దేశ రాజధానిలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత!

- Advertisement -

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం దేశ రాజధాని అయిన ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. నిన్న 1,86,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం… నిన్న 2,59,459 మంది కోలుకున్నారు.

దేశంలో 44 రోజుల్లో ఎన్న‌డూ లేనంత క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఇక ఢిల్లీలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 24 గంటల్లో 1100 కేసులు నమోదు అయ్యాయన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని.. దశల వారీగా ఆన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్టు తెలిపారు. జీవనోపాధి కోసం దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేజ్రీవాల్. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తామన్నారు.

పలమనేరులో దారుణం.. కూతురు ప్రియుడిని ముక్కలుగా నరికేసిన తండ్రి…!

కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ఆనందయ్య గురించి బాలయ్య ఏమన్నాడంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -