Sunday, April 28, 2024
- Advertisement -

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నానన్న షోయబ్ ఇక్భాల్

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆసుపత్రుల్లో ప్రతిరోజు హహాకారాలు.. శవాలను కాల్చడానికి కూడా స్థలాలు దొరకనంత ఘోరంగా తయారైంది. లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఢిల్లీలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానాల్లో చోటు చాలక పచ్చని పార్కులను, ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు అనువైన ప్రదేశాలుగా మారుస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంతలా ఉందంటే.. స్వయంగా ముఖ్యమంత్రే ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నామని, సాయం చేయాలని వ్యాపారవేత్తలకు లేఖ రాసిన పరిస్థితి.

తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే షోయబ్ ఇక్భాల్ అన్నారు. దేశ రాజధానిలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో నా ప్రాణ మిత్రుడు చనిపోయాడు.. అతడికి ఆక్సిజన్ చాలా అవసరం. కానీ, ఆక్సిజన్ గానీ, వెంటిలేటర్ గానీ ఏవీ అందుబాటులో లేవు. రెమ్డెసివిర్ మందులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా అర్థం కావట్లేదని బాధపడ్డారు.

ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక్కరికీ సాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారైనా తన మాటను పట్టించుకోలేదన్నారు. ఏ ఒక్క అధికారినీ కలవలేకపోతున్నానని చెప్పారు. కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును కోరుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభాస్ గురించి షాకింగ్ సీక్రెట్స్ రీవీల్ చేసిన బాహుబలి నటుడు!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కారుదే జోరు.. తేల్చేసిన ఎగ్జిట్‌పోల్స్..!

మానవత్వం చాటుకున్న పోలీస్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -