- Advertisement -

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలా?

- Advertisement -

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు పెచ్చుమీరిపోయాయి అన్నారు అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు అనేక దౌర్జన్యాలు చేయడమే కాదు మహిళలను కించపరుస్తున్నారు. వారిపై ఇంత వరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే ఎంతో మందిని నెలల తరబడి జైల్లో పెట్టిన ఈ ప్రభుత్వం తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మాత్రం చర్యలు తీసుకోదా? వీరికో న్యాయం వారికో న్యాయమా? చెప్పాలని మండిపడ్డారు.

రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్న పెన్షన్ ను వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 21 రకాల వైకల్యాలను గుర్తించి 66,36,000 మంది దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాదిలోపే 4,15,000 మందిని అనర్హులంటూ కోత పెట్టింది. దివ్యాంగులకు ఎప్పటి లాగే పెన్షన్లు ఇవ్వని నేపథ్యంలో వారి తరఫున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -