Sunday, May 5, 2024
- Advertisement -

11 త‌ర్వాత చంద్ర‌బాబు ఆశ‌లు అస్త‌మ‌యం అవుతాయి…ప్ర‌ధాని మోదీ

- Advertisement -

పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో భాజాపా ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచింది. భాజాపా త‌రుపున ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. క‌ర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ బాబు, ఆయ‌న పుత్ర‌ర‌త్నం లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ఆంగ్లభాషలో ‘ఎస్ యు ఎన్ సన్’ అంటే సూర్యుడు అని, ‘ఎస్ ఒ ఎన్ సన్’ అంటే కుమారుడు అని అర్థం అని చెప్పారుఓటుతో ఏప్రిల్ 11 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త సూర్యోదయాన్ని చూస్తుందని, అదే సమయంలో ఎవరైతే తన పుత్రుడి రాజకీయ ఎదుగుదలను చూడాలనుకుంటున్నారో వారి ఆశలకు, ఆకాంక్షలకు అస్తమయం అవుతుందని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలన్నారు. సూర్యోదయం కావాలి అనుకుంటే పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తును కోరుకుంటున్న ఆ తండ్రి ఆశలు నెరవేరకూడదని స్పష్టం చేశారు.

ఒక ఓటుతో కేంద్రంలో, మరో ఓటుతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జోడు ఇంజిన్లతో ప్రగతి పథంలో దూసుకుపోతామని అన్నారు. అంతకుముందు, తాను రాష్ట్రానికి ఎంతో చేయాలనుకుంటున్నానని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడంలేదని మోదీ విమర్శించారు. కర్నూలులో ఐఐఐటీ, మెగా పవర్ పార్క్ ఇచ్చింది తానేనని, విశాఖలో రైల్వే జోన్ ఇచ్చింది తానే అని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -