- Advertisement -
టీడీపీ, వైసీపీకి పోటీగా భాజాపా కూడా తమ పార్టీ తరుపున పోటీ చేసె అభ్యర్ధులను ప్రటించింది. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం కాసేపటి క్రితం జాబితాలోని సభ్యుల పేర్లను ప్రకటించింది. 123 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశ మయ్యింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో మంగళగిరి నుంచి జగ్గారపు రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. కుప్పం నుంచి తులసీనాథ్ చంద్రబాబుపై పోటీ చేయనున్నారు. మొదటి జాబితా పులివేందులలో జగన్‌పై పోటీ చేసె వ్యక్తిని మాత్రం ప్రకటించలేదు.




