Thursday, May 2, 2024
- Advertisement -

మీ చావు మీరు చావండి….నేనేం చేయ‌లేను…

- Advertisement -

ఎప్పుడు ఎక్క‌డ చూసిన నాది 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం అని తెగ సొంత‌డ‌బ్బా కొట్టుకొనే చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్యం క్లైమాక్స్‌కు చేరింది. గ‌తంలో క‌లాంను ప్ర‌సిడెంట్‌ను చేసింది నేనే, ప్ర‌ధాన మంత్రులు ఎవ‌ర‌నేది నిర్ణ‌యించింది నేనే అని చెప్పుకొనే బాబు సొంత పార్టీ విష‌యంలో మాత్రం చితికి ప‌డ్డారు.

చంద్రబాబు ఎత్తులు, జిత్తులు ఆఖరుకి సొంత పార్టీ నాయకులకు కూడా అర్ధం కావు. పైకి పార్టీనీ న‌డిపించండీ అంటూనే… తెర‌వెనుక మాత్రం అన్నీ తానై న‌డిపిస్తారు. అన్ని సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న బాబు తెలంగాణా ఎన్నిక‌ల్లో చేతులేత్తేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేను రాను మీరే చేసుకోండంటూ నాయ‌కుల‌కు షాక్ ఇచ్చారు.

ఓపక్కన ఏపీ ముఖ్యమంత్రి గా ఉంటూ ప్రచారం చేయడం బాగుండదని ఆయన చెబుతున్నట్లు భోగట్టా. ఇదే నిజమైతే టీటీడీపీకి అది గట్టి షాక్ అని చెప్పాలి. టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ బాబు ప్రచారానికి రాకపోతే ఇంక అక్కడ పార్టీ బతికి బట్టకట్టే పరిస్తితి ఏముంటుంది. ఇది ముందే చేతులు ఎత్తేసినట్లు కాదా అంటున్నారు.

మ‌రో వైపు ఓటుకు నోటు కేసు బాబును వెంటాడుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శింక తప్ప‌దు. ఒక వేల కేసీఆర్‌, ప్ర‌భుత్వం మీద ఆరోప‌న‌లు చేస్తే ఎక్క‌డ ఓటుకు నోటు కేసులో క‌ద‌లిక వ‌స్తుందోన‌నే బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎలాగూ తెలంగాణాలో టీడీపీ ప‌రిస్థితి పాతాలానికి ప‌డిపోయింది. పార్టీ ఉనికిన‌న్న కాపాడుకోవాలంటే ఏదోక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన గ‌త్యంత‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. చేసేదేమిలేక బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నసంగ‌తి తెలిసిందే.

కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తామని చెప్పిన బాబుకు ఆ పార్టీతో కలసి ప్రచారం లో పాల్గొనడం పట్ల అభ్యంతరాలు ఎందుకు ఉంటాయాన్న మాట ఇపుడు గట్టిగా వినిపిస్తోంది కారణం అదేనా లేక ఎన్నికల్లో ప్రచారం చేస్తే కేసీయార్ ని డైరెక్ట్ గా విమర్శించాలి. రేపటి రోజున మళ్ళీ కేసీయార్ సీఎం అయితే లేని పోని తలనొప్పులు వస్తాయన్న దూరాలోచనతోనే ఇలా అంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి చూస్తే బాబు బ్యాక్ సీటు డ్రైవింగ్ మాత్రమే చేస్తానని చెబుతున్నారు. దీనివల్ల లాభమా నష్టమా అన్నది తెలియక తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -